ఓ మనసా!
నీవు బాధపడేదెపుడో తెలుసా
లోపం నీలోనే దాగి వున్నప్పుడు
నీవు హర్షించేదెపుడో తెలుసా
నిర్మలత్వం నీలో కదలాడినప్పుడు
నీవు స్పందించేదెపుదో తెలుసా
మానవత్వం నీలో ప్రవహిస్తున్నపుడు
ఓ మనసా!
నీవు భగవంతుని ప్రతిరూపనివి
అందుకే నిత్యం వుండాలి పరిశుద్ధంగా
దివ్యత్వం నీలో ప్రవహించును
అందుకే కలిగి వుందాలి స్వఛ్ఛంగా
ఈశ్వర నేస్తమైన ఓ మనసా'
ఆధ్యాత్మిక పురోగతికి కారణం నీవే.